Followers

Monday, November 25, 2019

మజ్లిస్ రూపంలో ముస్లింల ఓట్లకు గండి..టీఎంసీలో కలవరం..







మహా'లో బీజేపీ కూటమికి లాభం






ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం బరిలో దిగడం వల్ల.. ముస్లింల ఓట్లు కాంగ్రెస్, మజ్లిస్ మధ్య చీలిపోయాయి. పరోక్షంగా ఇది బీజేపీ శివసేన కూటమికి ప్రయోజనం చేకూర్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రెండు సీట్లను గెలుపొందడంతోపాటు.. మొత్తంగా 7.37 లక్షల ఓట్లను సాధించింది. బీఎస్పీ, ఎస్పీ సాధించిన సీట్ల కంటే ఇది అధికం.












టీఎంసీలో కలవరం..






బెంగాల్‌లో మజ్లిస్ పోటీ చేయనుందనే వార్తలతో తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. దేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండో రాష్ట్రం బెంగాల్. పశ్చిమ బెంగాల్‌ ఓటర్లలో 27 శాతం ముస్లింలే. వీరంతా ఇప్పటి వరకు మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీకి మద్దతు ఇస్తున్నారు. వామపక్షాలకు కంచుకోట లాంటి బెంగా‌ల్‌లో 2011లో దీదీ జెండా ఎగరేయడానికి ప్రధాన కారణం ముస్లింలు టీఎంసీకి అండగా నిలవడమే.












దీదీలో ధీమా..






బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. దాదాపు 90 స్థానాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువ. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీఎంసీ దాదాపుగా అన్ని స్థానాలనూ టీఎంసీ గెలుపొందింది. 2021లో ఎన్నికల్లోనూ.. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్థానాల్లో తేలిగ్గా గెలవొచ్చనే ధీమాలో దీదీ ఇప్పటి వరకూ ఉన్నారు.












ఓవైసీ vs మమత



 




కానీ బెంగాల్లో పార్టీని విస్తరించడంపై అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నాలు ప్రారంభించారు. పక్కనే ఉన్న బిహార్‌లోని కిషన్‌గంజ్ సీటును గెలిచిన తర్వాత ఓవైసీ తన ఫోకస్‌ను బెంగాల్ వైపు మళ్లించారు. ఇప్పటి వరకూ ఆయన బెంగాల్‌లో పార్టీ విభాగాన్ని ప్రారంభించలేదు. కానీ కోల్‌కతా, దినాజ్‌పూర్, మాల్డా, ముషీరాబాద్, జల్పాయ్‌గురి, నదియా జిల్లాల్లోని యువతతో ఓవైసీ టచ్‌లో ఉన్నారు. వీరంతా మజ్లిస్ భావజాలాన్ని వ్యాపింపజేసే పనిలో ఉన్నారు.











బీజేపీ హిందూ కార్డ్..

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. బెంగాల్‌లో బీజేపీ హిందూ కార్డ్ ప్లే చేయగా.. టీఎంసీ ముస్లిం ఓటర్లను నమ్ముకుంది. ఫలితంగా బీజేపీ బెంగాల్‌లో 18 లోక్ సభ స్థానాలను గెలుపొందింది.












మజ్లిస్ రూపంలో ముస్లింల ఓట్లకు గండి..



 




హిందూ ఓట్లన్నీ బీజేపీకి మళ్లుతున్న వేళ.. దీదీ ముస్లిం ఓట్లమీదే ఆశలు పెట్టుకున్నారు. కానీ 2021లో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మజ్లిస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. టీఎంసీ, మజ్లిస్ మధ్య ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోతే.. పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే బీజేపీ దూకుడుతో కలవరానికి గురవుతున్న తృణమూల్ శ్రేణులను.. మజ్లిస్ రూపంలో మరో ముప్పు భయపెడుతోంది.












ఓవైసీ టార్గెట్‌గా విమర్శలు






మజ్లిస్ రూపంలో దూసుకొస్తున్న ముప్పును ఊహించిన మమతా బెనర్జీ.. తీవ్రవాదంటూ ఓవైసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. హిందూ ఓటర్లు 80 శాతానికిపైగా ఉన్న కుచ్ బిహార్‌లో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముస్లింలు ఓవైసీని నమ్మకుండా చూడటంతోపాటు.. హిందూ ఓటు బ్యాంకును తనవైపు మళ్లించుకోవాలనేది కూడా దీదీ వ్యూహంగా కనిపిస్తోంది. ఓవైసీ కూడా మమతను టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన పార్టీ బీజేపీ దగ్గర్నుంచి డబ్బులు తీసుకుందని మమత ఆరోపించారు.












2014 కంటే పెరిగిన టీఎంసీ ఓట్ల శాతం






2014 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 39 శాతం ఓట్లతో 34 సీట్లను గెలుపొందింది. 2019లో 22 సీట్లను మాత్రమే గెలిచింది. కానీ ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 3.5 శాతం పెరగడం గమనార్హం. బీజేపీ భయంతో ముస్లింలు టీఎంసీకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడమే దీనికి కారణం.












బీజేపీ గణనీయంగా..






మరోవైపు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 17 శాతం ఓట్లు సాధించగా.. 2019 లోక్ సభ ఎన్నికల నాటికి అది 40 శాతానికి చేరింది. మతాల వారీగా ఓట్లు చీలిపోయాయి అనడానికి పెరిగిన బీజేపీ ఓటు బ్యాంకే నిదర్శనం. బీజేపీ కారణంగా.. తనకు దూరమైన హిందూ ఓటు బ్యాంకును తిరిగి తనవైపు తిప్పుకోవడం, ముస్లింలు మజ్లిస్ వైపు మళ్లకుండా చూడటం దీదీ లక్ష్యంగా కనిపిస్తోంది.












ముస్లింలు కొద్ది శాతం మజ్లిస్ వైపు మళ్లినా..






ముస్లింలలో కొద్ది శాతం మంది ఎంఐఎం వైపు మళ్లినా.. అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం. లేదు. అందుకే టీఎంసీ నేతలు అసదుద్దీన్ ఓవైసీని.. బీజేపీ ఏజెంట్ అంటూ ఆరోపిస్తున్నారు. ఓవైసీ మతం పేరిట ఓట్లు రాబట్టేందుకు వస్తారని.. అది ముస్లింలకు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.






Monday, November 18, 2019

కోర్టు కేసులకు సంబంధించి వివిధ శాఖలు కౌంటర్లు దాఖలు చేయాలి - ఇంచార్జి కలెక్టర్ వి. చంద్రశేఖర్






నల్గొండ, నవంబర్ 18.కోర్టు కేసులకు సంబంధించి వివిధ శాఖలు కౌంటర్లు దాఖలు చేయాలని ఇంచార్జి కలెక్టర్ వి. చంద్రశేఖర్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో  జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వివిధ అంశాలు సమీక్షించారు.ఈ శుక్రవారం గ్రామ దర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు,గ్రామ దర్శిని లో హాస్టళ్లు, అంగన్ వాడి లను మండల పర్యవేక్షణ అధికారులు తనిఖీ చేయాలని అన్నారు.చెక్ లిస్టు ప్రకారం హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని అన్నారు.పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన ఆహారం అందించాలని, ఈ దిశగా హాస్టళ్లు,పాఠశాలలు తనిఖీ చేసి  మధ్యాహ్న భోజనం,ఆహార నాణ్యత పరిశీలించి పరిస్థితులు మెరుగు పరచాలని సూచించారు.సోమవారం నిర్వహించే సమావేశంలో ఆహార నాణ్యత మెరుగు పరచే విషయం పై అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, హాస్టళ్లు కు సంబందించి అధికారులు అందు బాటు లో ఉంచాలని అన్నారు.పత్తి, వరి దాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు లేకుండా చూడాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి డి.పి.ఓ.విష్ణువర్ధన్, ఇంచార్జి డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు



 

 



 



 

ఐపిఎస్టు దేశాభివృద్ధికి పాటుపడాలి: అమిత్ షా పోలీసు సేవల విశిష్ట సంప్రదాయంలో

హైదరాబాద్ : ఐపిఎస్ సాధించగానే ఆశయం సమన్వయం చేసుకుంటూ మంచి ఫలితాలు నెరవేరినట్టు కాదని నిజాయితీగా పనిచేసి సాధించాలన్నారు. ఈ వేడుకలో ప్రొబేషనర్స్ జనని దేశాభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర హోంశాఖ కవాతును పరిశీలించి , ఉత్తమ పనితీరు మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సర్దార్ వల్ల కనబరిచిన ప్రొబేషనర్లకు అమిత్ షా భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో బహుమతి ప్రదానం చేశారు. హైదరాబాద్ జరిగిన 70వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ సంస్థానాన్ని భారత్ లో విలీనం కోసం సర్దార్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి హోం వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజర అన్నారు. స్వదేశీ సంస్థానాల విలీనంలో య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. రు. డుతూ రాజకీయ నాయకులు కేవలం ఐదేళు పొలిస్ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే అధికారంలో ఉంటారని అదే సర్దార్ పటేల్ ఉంటారని అన్నారు సర్వీసుల పోలీసులు దాదాపు 30 ఏళ్లపాటు సర్వీసులో రూపకల్పనలోనూ పటేల్ కీలక పాత్ర ఉంటారన్నారు. పేదల తరపున నిలిచి వారికి పోషించారన్నారు. సమాజంలోని పేదల న్యాయం చేసేందుకు పోలీసులు కృషి అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆయన చేయాలని అన్నారు. పోలీసులు మనసు అభిలషించేవారన్నారు. అనేక దశాబ్దాలుగా గా చెప్పినట్టు నడుచుకోవాలని అయితే రాజ్యాంగ సమస్యగా మారిన జమ్మూ , కశ్మీర్‌కు ప్రధాని స్పూర్తి దెబ్బతినకుండా వ్యవహరించాలని నరేంద్ర మోదీ సర్కార్ విముక్తి కల్పించిందని సూచించారు. దేశ భద్రతలో రాజీపడకుండా పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుచేసి అక్కడి 30వేలకు పైగా అమరులయ్యారని, వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని బలిదానాలు మరవకూడదన్నారు. దేశం చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో ప్రస్తుతం అంతర్గతంగానూ, బహిర్గతంగానూ పటేల్ ఆశయం నెరవేరిందని చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉ ప్రధాన మంత్రి మోదీ స్వార్ట్ పోలీస్ గవాదం ఒకవైపు, మాదక ద్రవ్యాలు, సైబర్ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని కెం మరోవైపు సవాళ్లు విసురుతున్నాయ ముందుకెళ్లాలని కొత్త ఐపీఎస్ అధికారులకు న్నారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి సైతం హోంమంత్రి అమిత్ షా సూచించారు. యువ సమస్యలు పొంచి ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు అత్యంత అంకితభావంతా పోస్టింగ్ ఎక్కహైదరాబాద్ : ఐపిఎస్ సాధించగానే ఆశయం సమన్వయం చేసుకుంటూ మంచి ఫలితాలు నెరవేరినట్టు కాదని నిజాయితీగా పనిచేసి సాధించాలన్నారు. ఈ వేడుకలో ప్రొబేషనర్స్ జనని దేశాభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర హోంశాఖ కవాతును పరిశీలించి , ఉత్తమ పనితీరు మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సర్దార్ వల్ల కనబరిచిన ప్రొబేషనర్లకు అమిత్ షా భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో బహుమతి ప్రదానం చేశారు. హైదరాబాద్ జరిగిన 70వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ సంస్థానాన్ని భారత్ లో విలీనం కోసం సర్దార్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి హోం వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజర అన్నారు. స్వదేశీ సంస్థానాల విలీనంలో య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. రు. డుతూ రాజకీయ నాయకులు కేవలం ఐదేళు పొలిస్ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే అధికారంలో ఉంటారని అదే సర్దార్ పటేల్ ఉంటారని అన్నారు సర్వీసుల పోలీసులు దాదాపు 30 ఏళ్లపాటు సర్వీసులో రూపకల్పనలోనూ పటేల్ కీలక పాత్ర ఉంటారన్నారు. పేదల తరపున నిలిచి వారికి పోషించారన్నారు. సమాజంలోని పేదల న్యాయం చేసేందుకు పోలీసులు కృషి అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆయన చేయాలని అన్నారు. పోలీసులు మనసు అభిలషించేవారన్నారు. అనేక దశాబ్దాలుగా గా చెప్పినట్టు నడుచుకోవాలని అయితే రాజ్యాంగ సమస్యగా మారిన జమ్మూ , కశ్మీర్‌కు ప్రధాని స్పూర్తి దెబ్బతినకుండా వ్యవహరించాలని నరేంద్ర మోదీ సర్కార్ విముక్తి కల్పించిందని సూచించారు. దేశ భద్రతలో రాజీపడకుండా పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుచేసి అక్కడి 30వేలకు పైగా అమరులయ్యారని, వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని బలిదానాలు మరవకూడదన్నారు. దేశం చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో ప్రస్తుతం అంతర్గతంగానూ, బహిర్గతంగానూ పటేల్ ఆశయం నెరవేరిందని చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉ ప్రధాన మంత్రి మోదీ స్వార్ట్ పోలీస్ గవాదం ఒకవైపు, మాదక ద్రవ్యాలు, సైబర్ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని కెం మరోవైపు సవాళ్లు విసురుతున్నాయ