నల్గొండ, నవంబర్ 18.కోర్టు కేసులకు సంబంధించి వివిధ శాఖలు కౌంటర్లు దాఖలు చేయాలని ఇంచార్జి కలెక్టర్ వి. చంద్రశేఖర్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వివిధ అంశాలు సమీక్షించారు.ఈ శుక్రవారం గ్రామ దర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు,గ్రామ దర్శిని లో హాస్టళ్లు, అంగన్ వాడి లను మండల పర్యవేక్షణ అధికారులు తనిఖీ చేయాలని అన్నారు.చెక్ లిస్టు ప్రకారం హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని అన్నారు.పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన ఆహారం అందించాలని, ఈ దిశగా హాస్టళ్లు,పాఠశాలలు తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం,ఆహార నాణ్యత పరిశీలించి పరిస్థితులు మెరుగు పరచాలని సూచించారు.సోమవారం నిర్వహించే సమావేశంలో ఆహార నాణ్యత మెరుగు పరచే విషయం పై అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, హాస్టళ్లు కు సంబందించి అధికారులు అందు బాటు లో ఉంచాలని అన్నారు.పత్తి, వరి దాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు లేకుండా చూడాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి డి.పి.ఓ.విష్ణువర్ధన్, ఇంచార్జి డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు