Followers
Wednesday, December 18, 2019
రూ.50కోట్లతో జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి- మహమూద్‌అలీ
పౌరసత్వ చట్టంతో భారతీయ ముస్లింలకు సంబంధం లేదు: జామా మసీద్ షాహీ ఇమామ్
Tuesday, December 3, 2019
విమర్శలను స్వీకరించే స్ధితిలో మోడీ సర్కార్ లేదు -రాహుల్ బజాజ్ !
'యుపిఏ 2 కాలంలో మనం ఎవరిని అయినా తిట్టగలిగేవారం. మీరు మంచి పని చేస్తున్నారు, అయితే మేము మిమ్మల్ని బహిరంగంగా విమర్శించాలి అనుకుంటే మీరు దాని స్వభావాన్ని గ్రహిస్తారన్న విశ్వాసం లేదు. నేను చెప్పింది తప్పు కావచ్చు గానీ ప్రతివారు అలా భావిస్తున్నారు. భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పార్లమెంట్‌లో గాడ్సే గురించి వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీని కాల్చి చంపినవాడు ఒక ఉగ్రవాది అనటంలో ఎవరికైనా సందేహం ఉందా…..నాకు తెలియదు. గాడ్సే దేశభక్తుడని మేనెలలో ప్రజ్ఞ వర్ణించారు. దాని మీద ఆమెను క్షమించటం తనకు ఎంతో కష్టమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కానీ తరువాత ఆమెను రక్షణ శాఖ కమిటీలోకి తీసుకువచ్చారు.'
పైన పేర్కొన్న వ్యాఖ్యలు, విమర్శలు చేసిన వ్యక్తి ప్రతిపక్షానికి చెందిన వారు కాదు, నరేంద్రమోడీ వ్యతిరేకి అంతకంటే కాదు. రాజకీయవేత్త కాదు, కమ్యూనిస్టు అసలే కాదు. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్. పోనీ ఆయనేమైనా ఎక్కడో అన్నారా అంటే అదేమీ కాదు.అనేక మంది దృష్టిలో ప్రధాని నరేంద్రమోడీ కంటే బలవంతుడని భావించే హౌంమంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలోనే బహిరంగ వేదిక మీద చేసిన వ్యాఖ్యలవి. ముంబైలో నవంబరు 30న జరిగిన ఎకనమిక్ టైమ్స్ 2019 అవార్డుల ప్రదానోత్సవ సభలో రాహుల్ బజాజ్ చేసిన క్తుప్త ప్రసంగంలోని ముఖ్యాంశాలవి. ఎవరూ భయపడనవసరం లేదు, ప్రజ్ఞ చెప్పిన దానిని ఖండించాము అని వేదిక మీద ఉన్న అమిత్ షా చెప్పిన మాటలను నమ్మేందుకు ఎవరైనా చెవుల్లో కమలం పువ్వులు పెట్టుకొని ఉన్నారా ?
ఇదే రాహుల్ బజాజ్ జూలై చివరి వారంలో తమ కంపెనీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, గత మూడు నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి పడిపోతున్నదని ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వెల్లడిస్తోంది. డిమాండ్ లేకుండా ప్రయివేటు పెట్టుబడులు ఉండవు, అలాంటపుడు అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, స్వర్గం నుంచి ఊడిపడదు. అన్ని ప్రభుత్వాల మాదిరి వారు(మోడీ సర్కార్) చిరునవ్వు ముఖాన్ని చూపుతారు, కానీ వాస్తవం, వాస్తవమే' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇవి రాహుల్ బజాజ్ వ్యక్తిగత అభిప్రాయమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే బొంబాయి క్లబ్ కార్పొరేట్ల మనోగతం !
నిద్రపోతున్న వారిని లేపగలం గానీ నిద్ర నటిస్తున్నవారిని లేపగలమా ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంత నిర్ధారణగా మరొకరికి తెలియదు. అంతర్గతంగా ఏమి జరుగుతోందో కేంద్ర ప్రభుత్వానికి తెలిసినంతగా మరొకరికి ముందుగా తెలిసే అవకాశం లేదు. మోడీ సర్కార్, దాన్ని నిరంతరం కాపాడే ఉన్నత అధికార యంత్రాంగం గత కొద్ది సంవత్సరాలుగా అనేక విషయాలను మూసిపెడుతోంది. అవి పాచిపోయి వాసన కొట్టిన తరువాతే బయటకు వస్తున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ తన చుట్టూ తనకు తాన తందానా అనే వారినే నియమించుకున్నారని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అర్ధశాస్త్రం తెలియదన్నారు. అమెరికన్ పత్రిక హఫ్‌పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారు నిజమైన అభివృద్ది రేటు 4.8శాతం అంటున్నారు, నేను 1.5శాతమే అంటున్నాను అన్నారు.(ఈ ఇంటర్వ్యూ జరిగిన రెండు రోజుల తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం రెండవ త్రైమాసిక అభివృద్ధి రేటు 4.5శాతమే) మీరు చూస్తే గనుక మీడియా సమావేశంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తే నిర్మలా సీతారామన్ మైక్‌ను అధికారులకు ఇస్తారు. ఈ రోజు దేశంలో ఉన్న సమస్య ఏమిటి డిమాండ్ లేకపోవటం తప్ప సరఫరా లేమి కాదు, కానీ ఆమె కార్పొరేట్లకు పన్నుల రాయితీ ఇస్తున్నారు. వారు వాటిని తీసుకొని తమ రుణాలను తీర్చుకుంటారు, గతంలో కూడా అదే చేశారు. వాస్తవాలను ప్రధానికి చెప్పేందుకు ఆయన సలహాదారులు కూడా భయపడతారు. ప్రధానికేమీ దాని గురించి తెలియదు అద్భుతమైన ప్రగతి ఉందని చెబుతారు.
మాంద్యమా కాదా అన్నది కాదు అసలు నరేంద్రమోడీ సర్కార్‌కు ఆర్ధిక వ్యవస్ధలోపమేమిటో తెలియదనేందుకు అరకొర చర్యలు తీసుకుంటున్న తీరే నిదర్శనం అని ఆర్ధికవేత్త, 14వ ఆర్ధిక సంఘం సభ్యుడైన సుదీప్త మండల్ వ్యాఖ్యానించారు.అసలైన సమస్య డిమాండ్ వైపు ఉంది అన్నారు. ఆరునెలల ఆర్ధిక సమీక్ష నివేదికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అభివృద్ధి రేటు 4.9శాతానికి మించదు అన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలన్నీ సరఫరా వైపున ఉండే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, కార్పొరేట్ సంస్ధలు, రియలెస్టేట్ వంటి వాటికి రాయితీలు ఇవ్వటమే. డిమాండ్‌ను పెంచే జనం చేతుల్లో డబ్బు ఉండాలి అని సుదీప్త చెప్పారు.
డిమాండ్‌కు సంబంధించినవే ఉపాధి, వినిమయ అంశాలు. నాలుగున్నర దశాబ్దాల గరిష్ట స్ధాయి 6.1శాతానికి నిరుద్యోగం పెరిగిందన్న నివేదికను ఎన్నికల ముందు విడుదల కాకుండా తొక్కిపెట్టింది మోడీ సర్కార్. ఎన్నికల తరువాత వినిమయం తగ్గిపోయిందన్న నివేదిక తప్పుల తడక అంటూ దాన్ని కూడా మూసిపెట్టింది. అవి రెండూ తిరుగులేని పక్కా నివేదికలని ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో అభివృద్ధి రేటు 4.75శాతంగా నమోదై నిర్దారించింది, ఇది ఆరేండ్ల కనిష్టం.
కల్లు కుండను కొట్టేయటానికి ప్రయత్నిస్తూ దొరికి పోయిన వాడిని తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని అసలు విషయం దాచిన మాదిరి వ్యవహరిస్తున్నారు. ఆటో రంగంలో మాంద్యం ఎందుకంటే కుర్రవారు స్వంతకార్ల బదులు అద్దె కార్లవైపు మళ్లారని చెప్పటం అంటే దూడగడ్డి వ్యవహారమే. వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. తొలి మూడు మాసాలు అలాగే ఉంటుంది, రెండవ త్రైమాస ఫలితాలు చూడండి అన్నారు. తీరా అది 4.5కు దిగజారింది. ఇప్పుడు డిసెంబరు ఫలితాలు చూడండి అంటున్నారు.
ఈ పతనానికి కారణాలు ఏమిటి? అసలు సమస్యను అంగీకరించేందుకు మోడీ సర్కార్ సిద్దంగా లేదు. పెట్టుబడుల గురించి మోడీ హడావుడి ఏడాదికేడాది పెరుగుతోంటే వాస్తవంలో 2015-16 నుంచి దేశంలో నూతన పెట్టుబడుల ప్రతిపాదనలు క్రమంగా తగ్గుతున్నాయి.2006-07 నుంచి 2010-11 వరకు ప్రతి ఏటా సగటున 25లక్షల కోట్ల రూపాయల నూతన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. తరువాత దిగజారుడు ప్రారంభమై 2013-14లో పదిలక్షల కోట్ల రూపాయలకు పడిపోయాయి. తరువాత రెండు సంవత్సరాలలో 21, 20లక్షల కోట్లకు పెరిగాయి. 2015-16 తరువాత క్రమంగా తగ్గుతూ 2018-19లో 10.7లక్షల కోట్ల రూపాయలకు పడిపోయాయి. అయితే ఇవన్నీ కార్యరూపం దాల్చలేదు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే కొన్ని లక్షల కోట్లుగా కనిపించవచ్చుగానీ అవన్నీ పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేందుకు దోహదం చేసేవి కాదు. ఉదాహరణకు 2018-19లో జెట్ ఎయిర్‌వేస్ బోయింగ్ కంపెనీ నుంచి లక్షా 31వేల కోట్లతో 150 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రతిపాదించింది. తీరా దాన్ని రద్దు చేసుకుంది. అందువలన అంతిమంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఏ మేరకు కార్యరూపం దాల్చేది చెప్పలేము. ఈ ఏడాది జూన్, సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో పెట్టుబడుల ప్రతిపాదనలు కేవలం 1.83లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని బిజినెస్ టుడే అక్టోబరు ఏడవ తేదీన పేర్కొన్నది. ఇది 15 సంవత్సరాల కనిష్ట రికార్డు.
ఏటేటా ప్రభుత్వ పెట్టుబడులు దిగజారుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్ధలను తెగనమ్మి కార్పొరేట్లకు రాయితీలు, ద్రవ్యలోటును పూడ్చుకోవటం తప్ప వచ్చిన సొమ్మును తిరిగి పెట్టుబడులుగా పెట్టటం లేదు.2015-16లో పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించగా అది 2017-18లో 5.3లక్షల కోట్లకు, మరుసటి సంవత్సరానికి మూడు లక్షల కోట్లకు తగ్గిపోయాయి.
1991 నుంచి అమలు చేస్తున్న సరళీకరణ విధానాలలో భాగంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించివేస్తున్నారు. ఇదే సమయంలో కార్పొరేట్ శక్తులకు ఇచ్చే రాయితీలు ఏదో ఒక రూపంలో పెరుగుతూనే ఉన్నాయి. సంస్కరణలకు ముందు జిడిపిలో 12.7శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రస్తుతం ఏడుశాతానికి తగ్గాయని ప్రపంచ బ్యాంకు సమాచారం వెల్లడించింది.
అమెరికా, ఐరోపా ధనిక దేశాల మాదిరి వినియోగ ఆధారిత వ్యవస్ధగా మన దేశాన్ని మార్చివేసేందుకు ప్రపంచ, దేశీయ కార్పొరేట్ శక్తులు చేసిన యత్నం విజయవంతమైంది. అందుకే పరిమితంగా ఉన్న ధనిక మధ్యతరగతి ఆశలు, ఆకాంక్షలను తీర్చేందుకు వారికి దిగువన ఉన్న వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టే విధానాలను ముందుకు తెచ్చారు. ఇప్పటికీ ధనికుల కొనుగోలు డిమాండ్‌లో మార్పు ఉన్నట్లు ఎవరూ చెప్పటం లేదు. ప్రతి ఒక్కరూ గ్రామీణ వినియోగం తగ్గిందనే చెబుతున్నారు. మెజారిటీ జనం అక్కడే ఉన్నారు, వారి ఆదాయాలు పరిమితం కనుక వినియోగమూ పరిమితమే. మునిగే పడవకు గడ్డి పోచకూడా భారమే అన్నట్లుగా వారు ఆధారపడుతున్న వ్యవసాయ రంగంలో ఏ చిన్న ప్రతికూల పరిణామం జరిగినా వినియోగం పడిపోతుంది. గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం పరిష్కారం కాని కారణంగానే అది వినియోగం మీద ప్రభావం చూపి పారిశ్రామిక రంగాన్ని కూడా పడకేసేట్లు చేసింది. ఇది మన జనాభా పొదుపును హరించి వేస్తున్నది. పెట్టుబడికి వినియోగించే పొదుపు రేటు జిడిపిలో కొద్ధి సంవత్సరాల క్రితం సగటున 33.8శాతం ఉండగా 2019 ఆర్ధిక సంవత్సరంలో అది 29.3శాతానికి పడిపోయింది.ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారి తీస్తోంది. ద్రవ్యలోటు పెరగటం జనం మీద ఖర్చు చేసే సంక్షేమ పధకాలకు కోత పెట్టటం లేదా అప్పులు తీసుకోవటం, అధికంగా కరెన్సీ నోట్ల ముద్రణకు దారి తీస్తుంది. ఇదొక విష వలయం. అందుకే ద్రవ్యలోటు పెరిగింది అంటే తొలి దెబ్బ సామాన్యుల మీదనే పడుతోంది. దేశంలో ద్రవ్యలోటు పెరుగుదల గురించి తెలిసే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, పారి శామిక రంగాలకు పన్ను రాయితీలను ఇచ్చింది.
మన బడ్జెట్ అంచనాల ప్రకారం 2020 మార్చి నెల ఆఖరుకు ద్రవ్యలోటు ఏడులక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అది అక్టోబరు నాటికే అంటే ఏడునెలల కాలంలోనే 7.2లక్షల కోట్లకు(102.4శాతానికి) చేరింది.పన్ను ఆదాయం 6.83లక్షల కోట్లు అయితే ఖర్చు 16.55లక్షల కోట్లకు చేరింది. ముందే చెప్పుకున్నట్లు జిడిపి వృద్ధి రేటు తగ్గటం పన్ను ఆదాయాలు తగ్గటానికి కూడా దోహదం చేస్తుంది. అంటే లోటు మరింతగా పెరగటం లేదా బడ్జెట్‌కోతలకు దారి తీస్తుంది. మరొక మార్గం బంగారు బాతుల వంటి ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం.
సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగాన్ని వదిలించుకోవాలన్నది మన దేశం మీద ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ విధించిన ఒక ముఖ్యమైన షరతు. దాన్ని బయటకు చెబితే జనంలో వ్యతిరేకత వస్తుందనే భయంతో నష్టాల బారిన పడిన ప్రభుత్వరంగ సంస్దలను వదిలించుకోవాలనే ప్రచారం మొదలు పెట్టారు. జనానికి కూడా నిజమే అనిపించింది. ఆక్రమంలో ప్రభుత్వరంగం పతనం కావటానికి చేయాల్సిందంతా చేసి ఆ పేరుతో కారుచౌకగా ఆ శితులకు కట్టబెడుతున్నారు. ప్రయివేటు టెలికాం సంస్ధలు ఐదవ తరం టెక్నాలజీలోకి మారటం గురించి ఆలోచిస్తుంటే ప్రభుత్వ బిఎస్‌ఎన్‌ఎల్‌ను మూడవ తరం టెక్నాలజీకే పరిమితం చేసే చర్యలు తీసుకోవటం దానిలో భాగమే. ప్రభుత్వంలోని చమురు సంస్ధలు లాభాలు ఆర్జిస్తున్నాయి, అయినప్పటికీ వాటిని(బిపిసిఎల్) అమ్మివేయాలని నిర్ణయించారు. ఇదెక్కడి ఘోరం అని ప్రశ్నిస్తే ప్రభుత్వాలు వ్యాపారాలకు దూరంగా ఉండాలి కనుక అమ్మివేస్తున్నాం, అది కూడా ప్రయివేటు రంగానికే అని బిజెపి సర్కార్ చెబుతోంది. ఇంక నాటకాలు ఆడేందుకు ఏమాత్రం అవకాశం లేదు కనుక అసలు విషయాలు చెబుతున్నారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది జనమే.
నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తా: వర్మ
టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అందిస్తున్న తాజా చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ కారణాల వల్ల రిలీజ్ కాలేదు. అయితే ఈ సినిమా పేరును 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా మార్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ – “అమ్మరాజ్యంలో కడపబిడ్డలు ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఏ కులాన్ని కానీ ఏ వర్గాన్ని కానీ తక్కువ చేసి చూపలేదు. సిఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం తరువాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ సిద్ధం చేశాను.
నేను ఎవరినీ టార్గెట్ చేసి తీసిన సినిమా కాదు ఇది. కేవలం నాకు ఆసక్తికరంగా అనిపించిన పాయింట్‌తో మాత్రమే ఈ సినిమాను తెరకెక్కించాను. మామూలు క్రైమ్ కన్నా పొలిటికల్ క్రైమ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అందుకనే ఈమధ్య ఆ తరహా సినిమాలు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ముందు ఒక లైన్ వస్తుంది 'మే 2019 నుండి సెప్టెంబర్ 2020 వరకూ జరిగిన ఘటనల ఆధారంగా' అని. జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా… జరుగబోయే అంశాలను ఈ సినిమాలో ఊహించి చెప్పడం జరిగింది. సెన్సార్ రూల్ ప్రకారం చూస్తే .. ఏ సినిమా రిలీజ్ కాదు. కానీ అన్ని రూల్స్‌ను నా సినిమా మీదే ఎందుకు ప్రయోగిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఎవరినైనా ప్రేమించడానికి లేదా ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. ఒక సినిమా ట్రైలర్ చూసి ప్రేక్షకులు సినిమా చూడాలి అని ఫిక్స్ అయితే విడుదల ఆలస్యమైనా తప్పక చూస్తారు.
నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే మా ప్రొడక్షన్ నుండి 'బ్యూటిఫుల్' అనే లవ్ స్టోరీ వస్తుంది”అని అన్నారు. నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ – “మా సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలంటే అర్జెన్సీ సర్టిఫికెట్ కావాలన్నారు. దాన్ని పొందుపరిచి నవంబర్14న సెన్సార్‌కు దరఖాస్తు చేశాం. అందుకే మేము రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ సెన్సార్ వారు ఎలాంటి కారణం చూపకుండా ఇంతవరకు సినిమా చూడలేదు. ఈ సందర్భంగా నా మనవి ఏంటంటే సినిమా చూసిన తరువాత ఏది చెపితే … రూల్స్ ప్రకారం అది మేము ఫాలో అవుతాము. అయితే మేము కోర్ట్‌ను ఆశ్రయించడం జరిగింది. చీఫ్ జస్టిస్ గురువారం నుండి ఏడు రోజుల లోపల సినిమా చూసి ఎగ్జామినేషన్ చేయాలనీ ఆర్డర్ పాస్ చేశారు. సెన్సార్ కారణం వల్లే రిలీజ్ డేట్ వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే కొత్త డేట్ ప్రకటిస్తాం”అని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత అజయ్ మైసూర్ పాల్గొన్నారు.
రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు?
టాలీవుడ్ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌నున రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగం కారణంగా రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి విదితమే. ఈ ఘటనలో రాజశేఖర్ స్వల్పంగా గాయపడ్డారు. గతంలో కూడా ఆయన వేరే కారును ఢీకొట్టిన ఘటనలో వివాదం రేగింది. తాజా ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో ఆయన డ్రైవింగ్ తీరును గమనించారు.
ఔటర్‌పై ఆయన కారు దాదాపు 21సార్లు అతి వేగంతో దూసుకెళ్లినట్లు గుర్తించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఆయన కారు నడిపినట్లు కూడా నిర్ధారించారు. దీంతో ఆయన డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయాలంటూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్ ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేశా
అందాలతో హల్‌చల్
ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త తరం భామల హవా పెరుగుతోంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నిధి అగర్వాల్ కూడా ఈ లిస్టులో చేరి కెరీర్‌లో పైపైకి దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో రెండు, మూడు సినిమాలు చేసిన ఈ భామకు మొదట్లో సక్సెస్ దక్కలేదు కానీ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయంతో నిధి ఒక్కసారిగా హాట్ షాట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ భామకు నటన విషయంలో పెద్దగా మార్కులు పడలేదు కానీ గ్లామర్ విషయంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుంది. ఎలాగూ గ్లామర్ విషయంలో దిట్ట కాబట్టి సూపర్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఈ భామ ఒక హాట్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లైట్ గ్రే కలర్ ఛోళి, లెహెంగాలో అందాలొలకబోసింది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
మగువ కూడా మనిషే అని మరిచిపోరో: మహేష్ బాబు
హైదరాబాద్: టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రియాంకరెడ్డి ఘటనపై స్పందించారు. ప్రియాంకరెడ్డికి జరిగిన అన్యాయంపై దేశమంతా ఆవేశం పెల్లుబిక్కుతోంది. ప్రియాంక రెడ్డిని హతమార్చిన నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో, ఎవరి మాట మన్ననగా ఉంటుందో, ఎవరి మనసు మెత్తగా ఉంటుందో, ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో, ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో, ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువినిస్తారో, వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో, ఎవరి మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో, స్త్రీకి శక్తి ఉంది, గుర్తింపు, గౌరవం ఉండాలని ఎవరు అనుకుంటారో, ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో, అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు, సహచరుడు, ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు అంటూ వీడియోను తన స్వరతో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మృగాళ్లను క్షమించరాదు
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాలపై ఉక్కుపాదం మోపుతామని, అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రా క్ కోర్టులు ఏర్పాటు, దోషులకు కఠిన శిక్షలు ప డేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. శంషాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై సిఎం కెసిఆర్ స్పందించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హన్మకొండ మానస, హాజీపూర్ తదితర అత్యాచార కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సిఎం అధికారులను కోరారు. ఇటీవల వరంగల్లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడిందని సిఎం గుర్తుచేశారు. అదే తరహాలో మిగిలిన కేసులో కూడా సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని, మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అత్యాచార బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తుందని, బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సిఎం హామీ ఇచ్చారు.
జస్టిస్ ఫర్ దిశ
ప్రియాంక హత్యాచారంపై ప్రపంచ వ్యాప్త నిరసనలు
మన తెలంగాణ/హైదరాబాద్: 'జస్టిస్ ఫర్ దిశ' ఉదంతంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. సినిమా, రాజకీయ రంగం స హా ఇతర రంగాల్లోని ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'జస్టిస్ ఫర్ దిశ' నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో 'జస్టిస్ ఫర్ దిశ' ఓ ఉద్యమంగా మారింది. బాధిత కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగానే కాదు.. విదేశీయులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ట్విటర్ ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నందునే భారతను సందర్శించాలంటే భయంగా ఉందని ఓ విదేశీ మహిళ చేసిన ట్వీట్ ఆలోచింపజేస్తోంది.
భారత్ కు వెళ్లి ఇలాంటి దారుణాలకు బలై ఇక తిరిగి రాకపోవచ్చునేమో అని సందేహం వ్యక్తం చేసింది ఆ మహిళ. తాజా హత్యాచార ఘటనలో నిందితుల్ని సజీవ దహనం చేయాలంటూ ఇక్కడి ఆందోళనకారులతో తన స్వరాన్ని కలిపింది. మరోవైపు పోలాండ్ లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన బుడతడు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఇలా బాధితురాలి హ్యాష్ టాగ్‌తో ట్విటర్ లో అనేక మంది తమ అభిప్రాయాన్ని, ఆవేదనను పంచుకుంటున్నారు. పలు అంతర్జాతీయ పత్రికల్లో సైతం 'జస్టిస్ ఫర్ దిషా' ఘటనను ప్రధానంగా ప్రచురించాయి.
బీబీసీ, గల్ఫ్ న్యూస్, డైలీ మెయిల్ వంటి ప్రముఖ సంస్థలు వార్తకు ప్రాధాన్యం ఇచ్చాయి. బాధుతురాలి కుటుంబసభ్యులు పోలీసుల్ని సంప్రదించినప్పుడు వారు ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిని ప్రధానంగా ప్రస్తావించాయి. ఇలాంటి ఘోరాల్ని నిరోధించేలా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశాయి. ఇటు దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు, ప్రజాసంఘాలు బాధితురాలి కుటుంబానికి సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 'జస్టిస్ ఫర్ దిషా' నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రచారంతో ప్రమాదం : సిపి సజ్జనార్
శంషాబాద్ హత్యాచార ఘటనలో బాధితురాలి వివరాలను ప్రచురించరాదని మీడియా సంస్థలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఇలాంటి అత్యంత హేయమైన సంఘటన వివరాలను పదేపదే ప్రసారం చేయడంతో ప్రజలు ప్రత్యేకించి మహిళలు వారి తల్లితండ్రుల్లో భయం నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మీడియా సంయమనం పాటిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో తమతో కలిసి రావాలని, ప్రజల్లో విశ్వాసం నెలకొల్పి వారికి మేమున్నామనే భరోసా ఇవ్వడంలో సహకరించాలని కోరారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఇలాంటి ఘటనల్లో బాధితురాలి పేరు ఇతర వ్యక్తిగత వివరాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి దూరంగా ఉండాలని మీడియా సంస్ధలను కోరుతున్నామని చెప్పారు. బాధితురాలి వివరాలు వెల్లడికావడంతో బాధిత కుటుంబానికి వివిధ రూపాల్లో సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బాధితులు ఏం చేయాలనే విషయంలో వారిలో అవగాహన పెంచే అంశాలను ప్రసారం చేయాలని కోరారు.
పోస్టులపై.. పోలీసులు సీరియస్
సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఎవరైనా అసభ్యంగా పోస్టింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు అందగా వెంటనే కొన్ని అసభ్య ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఇదిలావుండగా జస్టిస్ ఫర్ ఉదంతం తర్వాత కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఆమెను కించపరుస్తూ అసభ్య పోస్టులు పెట్టి.. నిందితులకు మద్దతుగా పోస్టులు చేస్తూ మరికొందరు అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు. అయితే మరికొందరు నెటిజన్లు ఆ మద్దతు పలికిన వారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
ఆగని ఆందోళనలు
జస్టిస్ ఫర్ దిషా కేసులో నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఆదివారం సాక్షాత్తూ చర్లపల్లి జైలు వద్దే యువకులు, ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి యువకులు, ప్రజలు బైక్ ర్యాలీగా చర్లపల్లి జైలు వద్దకు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. జైలు గేటు ముందు కూర్చొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో జైలు వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. శనివారం కూడా షాద్నగర్ పీఎస్ వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి నిందితులకు ఉరిశిక్ష వేయాల్సిందేనని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఆర్‌టిసి ఉద్యోగులు ఖుష్
ఆర్‌టిసి ఉద్యోగులు మంచి జోష్ మీద ఉన్నారు.. ఖుషిఖుషిగా సంబరాలు జరుపుకుంటున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం 55 రోజుల పాటు సమ్మె చేసిన కార్మికులకు ఊహించని వరాలు పొందారు. సిఎం కెసిఆర్‌తో ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సిఎం కెసిఆర్ వరాలు కురిపించారు. అంతేకాదు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌టిసి కార్మికులు కాదు ఆర్‌టిసి ఉద్యోగులమని పిలవాలన్నారు. యాజమాన్యం, ఉద్యోగులు వేరువేరుకాదు అందరూ ఒకే కుటుంబంలాగా వ్యవహరించాలని సిఎం స్పష్టం చేశారు. అన్నింటికంటే మిన్నగా ఆర్‌టిసి సిబ్బంది సమ్మె చేసిన 55 రోజులకు వేతనాలు చెల్లిస్తామన్న సిఎం ప్రకటనతో ఆ ప్రాంతమంతా కరతాళధ్వనులతో మారుమోగింది.
అసలు అడిగేందుకు కూడా సంశయించే అంశాన్ని సిఎం స్వయం ప్రస్తావించి వేతనాలు చెల్లిస్తామని వెల్లడించడంతో ఆనందంతో మైమరిచిపోయారు. సమ్మె కాలంలో మరణించిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇస్తామన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. ఆర్‌టిసి సిబ్బందికి చెల్లించాల్సిన సెప్టెంబర్ జీతాన్ని డిసెంబర్ 2న చెల్లిస్తామని చెప్పారు. ఉద్యోగుల ఇంక్రిమెంట్ కూడా యధావిధిగా ఇస్తామన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్‌లో ఆర్‌టిసికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని సిఎం చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. టికెట్ తీసుకునే బాధ్యత కూడా ప్రయాణికులపైనే ఉంటుందని.. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు ఉండవని తెలిపారు. ఉద్యోగుల తల్లిదండ్రులకు ఆర్‌టిసిలో ఆరోగ్య సేవలు, ఉచిత బస్‌పాస్‌లు కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు.
మహిళలకు రాత్రి 8 వరకే డ్యూటీలు…!
మహిళా ఉద్యోగులకు రాత్రి 8 వరకే డ్యూటీలు ఉంటా యి. అర్ధరాత్రులు డ్యూటీలు ఆర్‌టిసిలో ఉండవని సిఎం చెప్పారు. పతి డిపో లో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటుచేస్తామన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూ తి సెలవులతో పాటు మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తామని చెప్పారు. మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్‌లో రావాలనే నిబంధనలు ఇక ఉండవు. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు సిఎం కల్పించారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు సిఎం ఒప్పుకున్నారు.