హైదరాబాద్: తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి జహంగీర్ పీఆర్ దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్‌అలీ నిర్వాహకులకు విజ్ఞప్తిచేశారు. అలాగే 40 ఎకరాల్లో 50కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం పూనుకుందని అన్నారు. ఈసందర్భంగా సిద్ధం చేసిన మాస్టర్‌ప్లాన్‌నుఆయన పరిశీలించారు. బుధవారం కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి హోంమంత్రి దర్గాను సందర్శించారు. అనంతరం అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పార్కింగ్, బస్టాప్, మజీద్, దర్గా తదితర నిర్మాణాలకు సంబంధించిన పనులను చేపట్టాలని అన్నారు. అందరి సహకారంతో పనులను వచ్చే మాసంలోనే పనులను చేపట్టాలని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 22 కోట్లతో రోడ్ల నిర్మాణపనులు చేపట్టనున్నట్టు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దర్గా పరిసరాలను అభివృద్ధి చేస్తే ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ది అవుతాయని అన్నారు. సీఎం కేసీఆర్ దర్గా అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని అన్నారు.