హైదరాబాద్: టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రియాంకరెడ్డి ఘటనపై స్పందించారు. ప్రియాంకరెడ్డికి జరిగిన అన్యాయంపై దేశమంతా ఆవేశం పెల్లుబిక్కుతోంది. ప్రియాంక రెడ్డిని హతమార్చిన నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో, ఎవరి మాట మన్ననగా ఉంటుందో, ఎవరి మనసు మెత్తగా ఉంటుందో, ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో, ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో, ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువినిస్తారో, వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో, ఎవరి మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో, స్త్రీకి శక్తి ఉంది, గుర్తింపు, గౌరవం ఉండాలని ఎవరు అనుకుంటారో, ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో, అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు, సహచరుడు, ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు అంటూ వీడియోను తన స్వరతో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.