Followers

Tuesday, December 3, 2019

రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు?


టాలీవుడ్ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌నున రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగం కారణంగా రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి విదితమే. ఈ ఘటనలో రాజశేఖర్ స్వల్పంగా గాయపడ్డారు. గతంలో కూడా ఆయన వేరే కారును ఢీకొట్టిన ఘటనలో వివాదం రేగింది. తాజా ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో ఆయన డ్రైవింగ్ తీరును గమనించారు.


ఔటర్‌పై ఆయన కారు దాదాపు 21సార్లు అతి వేగంతో దూసుకెళ్లినట్లు గుర్తించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఆయన కారు నడిపినట్లు కూడా నిర్ధారించారు. దీంతో ఆయన డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయాలంటూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్ ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేశా