Followers

Monday, July 26, 2021

ఎంపీ కవితకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం

మన ఊపిరి,  హైదరాబాద్  ప్రతి నిది : ఎంపీ కవితకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం...పార్లమెంట్​ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు హైదరాబాద్​లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఆరు నెలల జైలు శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా విధించిన న్యాయస్థానం... జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. పది వేల రూపాయల జరిమానా చెల్లించడంతో... హైకోర్టుకు అప్పీల్ వెళ్లేందుకు వీలుగా కవిత శిక్షను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలువిషయం ఏమిటంటే..!! పార్లమెంటు ఎన్నికల్లో తెరాస మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోత్ కవిత పోటీ చేశారు.  ఆ..సమయంలో బూర్గుంపాడులో తెరాస కార్యకర్త  షౌకత్ అలీ వద్ద 9 వేల 400 రూపాయలు స్వాధీనం చేసుకున్న ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  షౌకత్ అలీతో పాటు అభ్యర్థిగా ఉన్న మాలోత్.కవితపై  2019లో ఐపీసీ 188, 171 బీ ప్రకారం కేసు నమోదు చేసిన బూర్గంపహాడ్ పోలీసులు... హైదరాబాద్​లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఐపీసీ 171 బీ కింద మాలోత్ కవిత, షౌకత్ అలీపై నేరాభియోగాలు రుజువైనట్లు ప్రకటించింది.

ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే జట్టుకడతాం: ఎస్‌పీకి స్పష్టం చేసిన ఎంఐఎం


* వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు

* కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్న అసద్

* ఎస్‌పీతో పొత్తుకు షరతు

మన ఊపిరి, ఢిల్లీ  ప్రతినిది : ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే జట్టుకడతాం: ఎస్‌పీకి స్పష్టం చేసిన ఎంఐఎం

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ పొత్తులు కలుపుకునే పనిలో పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) తో పొత్తుకు సిద్ధమైన అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం ఓ కండిషన్ పెట్టింది. ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనుక తమకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని షరతు విధించింది. వచ్చే నెలలో యూపీలో పర్యటించనున్న అసదుద్దీన్ ఎస్‌పీతో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

రానున్న ఎన్నికల్లో యూపీలో వంద స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసద్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల యూపీలో పర్యటించిన ఆయన.. కాంగ్రెస్‌ను మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. ఆ పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలోని బీజేపీని సాగనంపేందుకు పొత్తు అవసరమన్న ఆయన ఎస్‌పీతో పొత్తు విషయాన్ని ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నా, గెలిస్తే మాత్రం తమకే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ను ఎస్‌పీ ఎదుట ఉంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు ఆ పార్టీ అంగీకరిస్తే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అసద్ యోచిస్తున్నట్టు సమాచారం.


 ఉద్యోగా నియామకాల పై శ్వేతా పత్రం విడుదల చేయాలి :: టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి


మన ఊపిరి, సూర్యాపేట : ఉద్యోగా నియామకాల పై శ్వేతా పత్రం విడుదల చేయాలి :: టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి  పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

 ఈరోజు పొట్లపాడు గ్రామం నుండి మాజీ సర్పంచ్   నారాయణ సునీత శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీ లకు రాజీనామా చేసి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

*పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కేవలం దొంగలకు మాత్రమే దక్కింది అని అన్నారు

* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అన్ని విఫలం అయినవి అని అన్నారు

* నేడు పెట్రోల్ గ్యాస్ వంట సరుకులు పై మునుపెన్నడూ లేని విధంగా అడ్డగోలుగా ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపి సంపన్న వర్గాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న మోదీ. దళిత బందు అంటూ దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓడించి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లో  బచ్చుపల్లి నాగేశ్వరరావు, బెల్లంకొండ రాములు, మండలి పిచ్చయ్య,  ఎంపిటిసి పవన్, ఎంపిటిసి నాగరాజు, కుందూరు వెంకట్ రెడ్డి, యట ఉపేందర్, దేవయ్య దామోదర్ రెడ్డి, రామ్ రెడ్డి, యట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.


Sunday, July 25, 2021

 అక్షరాలు కలుషితమవుతున్నాయ్...,

అక్షరాలు సామాన్యులకు అందకుండా పోతున్నాయ్...,

అక్షరాలు కార్పోరేట్ సంస్థల చేతుల్లో బంధీలవుతున్నయ్..,

అక్షరాలు బడాబాబుల కనుసన్నల్లో నడుస్తున్నాయ్..,

చివరికి అక్షరాలు అమ్ముడుపోతున్నాయి.....


అందుకే..., అందుకే ..,

ప్రజాక్షేత్రంలో.., 

వంచించబడుతున్న గుండెల్లో.., 

గాయపడిన మనసులలో...

అక్షరాలను అలుకుతున్నాను...

అవి...

సామాన్యులకు శక్తినిచ్చే గోరుముద్దలవుతాయి

రైతుల దోసిళ్ళలలో వరికంకులవుతాయి

శ్రామికుడి చేతుల్లో చెమటచుక్కలవుతాయి

అణగారిన జనం చేతుల్లో  ఆయుధాలవుతాయి.

                                            - మహమ్మద్ రియజుద్దిన్, సీనియర్ జర్నలిస్ట్.