అక్షరాలు కలుషితమవుతున్నాయ్...,
అక్షరాలు సామాన్యులకు అందకుండా పోతున్నాయ్...,
అక్షరాలు కార్పోరేట్ సంస్థల చేతుల్లో బంధీలవుతున్నయ్..,
అక్షరాలు బడాబాబుల కనుసన్నల్లో నడుస్తున్నాయ్..,
చివరికి అక్షరాలు అమ్ముడుపోతున్నాయి.....
అందుకే..., అందుకే ..,
ప్రజాక్షేత్రంలో..,
వంచించబడుతున్న గుండెల్లో..,
గాయపడిన మనసులలో...
అక్షరాలను అలుకుతున్నాను...
అవి...
సామాన్యులకు శక్తినిచ్చే గోరుముద్దలవుతాయి
రైతుల దోసిళ్ళలలో వరికంకులవుతాయి
శ్రామికుడి చేతుల్లో చెమటచుక్కలవుతాయి
అణగారిన జనం చేతుల్లో ఆయుధాలవుతాయి.
- మహమ్మద్ రియజుద్దిన్, సీనియర్ జర్నలిస్ట్.