ఉద్యోగా నియామకాల పై శ్వేతా పత్రం విడుదల చేయాలి :: టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
మన ఊపిరి, సూర్యాపేట : ఉద్యోగా నియామకాల పై శ్వేతా పత్రం విడుదల చేయాలి :: టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈరోజు పొట్లపాడు గ్రామం నుండి మాజీ సర్పంచ్ నారాయణ సునీత శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీ లకు రాజీనామా చేసి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
*పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కేవలం దొంగలకు మాత్రమే దక్కింది అని అన్నారు
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అన్ని విఫలం అయినవి అని అన్నారు
* నేడు పెట్రోల్ గ్యాస్ వంట సరుకులు పై మునుపెన్నడూ లేని విధంగా అడ్డగోలుగా ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపి సంపన్న వర్గాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న మోదీ. దళిత బందు అంటూ దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓడించి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లో బచ్చుపల్లి నాగేశ్వరరావు, బెల్లంకొండ రాములు, మండలి పిచ్చయ్య, ఎంపిటిసి పవన్, ఎంపిటిసి నాగరాజు, కుందూరు వెంకట్ రెడ్డి, యట ఉపేందర్, దేవయ్య దామోదర్ రెడ్డి, రామ్ రెడ్డి, యట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.